విజ్ఞాన్ పాఠశాలలో బోనాల వేడుకలు
చందుర్తి,(విజయక్రాంతి): తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల వేడుకలు మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం పాఠశాల కరస్పాండెంట్ గోపి, ప్రిన్సిపాల్ లింగాల లింగయ్య, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వివిధ వేషాధారణలు,పోతరాజుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యార్ధినులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బోనాలు వండి అమ్మవారికి బోనం సమర్పించారు.
ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించడం పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం అని పాఠశాల కరస్పాండెంట్ అన్నారు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తు పిల్లలకు విద్యార్థి దశ నుండే మన సంస్కృతి సంప్రదాయల పట్ల అవగాహణ కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని, అధ్యాపక బృందాన్ని గ్రామస్తులు అభినందించారు.






