11 August, 2026 | 4:47 PM

చదువురాని సీఎం సోదరులు.. పెద్ద పెద్ద కంపెనీలకు ఓనర్లు

11-08-2026 03:31 PM

హైదరాబాద్: టెసరాక్ అనే కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏకరాలు కేటాయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టెసరాక్ కంపెనీకి అనుముల కొండల్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారని, ఒక్క ఉద్యోగి కూడా లేకుండా టెసరాక్ అనే కంపెనీ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఊరుపేరు లేని కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమి ఇచ్చారని, కొండల్ రెడ్డికి కోట్ల విలువైన స్థలాన్ని గజం రూ.750 చొప్పున కేటాయించారు. చదువురాని రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్దపెద్ద కంపెనీలకు ఓనర్లు అవుతున్నారని, చిన్న చిన్న ఇంటి అడ్రస్ తో పెద్దపెద్ద కంపెనీలు రిజిస్టర్ చేయించారని కేటీఆర్ ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి మరో సోదరుడు జగదీష్ రెడ్డి భారీ ఎంఓయూ చేసుకున్నారని, సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్టర్లు ఇచ్చారని చెప్పారు. అల్లుడి ఫార్మా కంపెనీ కోసం లగచర్లలో భూములు లాక్కున్నారని, ముఖ్యమంత్రి కుటుంబమంతా దోపిడీ చేస్తుంటే మంత్రులు వంతపాడుతున్నారని మాజీ మంత్రి విరుచుకుపడ్డారు. కనీసం వార్డు సభ్యుడు కాని తిరుపతి రెడ్డికి సీఎం ప్రొటోకాల్ ఎందుకు ఇస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని, రాష్ట్రం అనుముల సోదారుల సామ్రాజ్యం అన్నట్లుగా మారిందని చెప్పారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ వేల కోట్ల దోపిడీని అడ్డుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.