4 August, 2026 | 6:41 PM

ఆరెకటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

04-08-2026 05:21 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆరె కటికే సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ బోనాల పండుగకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజులు పాల్గొని బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులు సంగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా పాల్గొనగా, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వాహకులు పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.