రేడు గ్రామంలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు
19-06-2026 09:03 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలతో పోతరాజుల విన్యాసాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గామాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందాస్ మోహన్, నాయకులు పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, యాటగారి నారాయణ, గౌస్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.






