కిడ్స్ కాన్వెంట్‌లో బోనాల సందడి
వేములవాడ, జులై 28, (విజయ క్రాంతి): కిడ్స్ కాన్వెంట్ హైస్కూల్లో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు వారిలో భక్తి భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో అమ్మవారి వేషధారణలతో వేడుకలు నిర్వహించారు.విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నరాల దేవేందర్, డైరెక్టర్ ఫసివుల్లా, ప్రిన్సిపాల్ దరక్షణ్ వస్ఫియ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, విలువలు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.






