15 April, 2026 | 10:33 AM

గ్రామదేవతలకు ఘనంగా బోనాలు

06-06-2025 12:00 AM

సదాశివ నగర్, జూన్ 5 (విజయ క్రాంతి : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం  భూంపల్లి గ్రామంలో గురువారం  గ్రామ దేవతలకు బోనాలు తీసినట్టు గ్రామస్తులు తెలిపారు. నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ, మైసమ్మ, నాయకమ్మ , అమ్మవారి విగ్రహాలకు ఘనంగా బోనాలు నిర్వహించారు.

అందులో భాగంగా గ్రామంలో ప్రతి ఇంట నుండి బోనం తీస్తారని తెలిపారు. దర్భంగా మహిళలు ఉపవాసంతో ఉంటూ బోనం నెత్తిన పెట్టుకొని శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతల నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వర్షాలు బాగా కురవాలని పాడిపంట, పిల్ల పాపలందరూ బాగుండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  గ్రామంలోని వివిధ కులపెద్దలు వివిధ పార్టీ నాయకులు, మహిళ లు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.