21 August, 2026 | 9:34 PM

Breaking News

అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •   గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ   •   సాలూరలో SIR-2026 నోటీస్ జనరేషన్ ప్రక్రియ పరిశీలన   •   బెల్లల్ ఇందిరమ్మ కాలనీలో ఆర్డీవో తహసీల్దార్ పరిశీలన   •   వాలీబాల్ క్రీడాకారునికి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం   •   కళాకారులను విస్మరిస్తున్న ప్రభుత్వం   •  

సన్న వరికి రూ.500 బోనస్‌

21-08-2026 08:58 PM

సెప్టెంబర్‌ 10లోగా రైతుల వివరాల నమోదు

చివ్వెంల: వానాకాలం-2026లో ప్రభుత్వం గుర్తించిన 7 సన్న వరి రకాల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందించనుంది. బోనస్‌ పొందేందుకు రైతులు సెప్టెంబర్‌ 10లోగా తమ వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు తెలిపారు. గుర్తింపు పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు బిల్లులతో డీలర్లను సంప్రదించి నమోదు చేయించుకోవాలి.

సొంత విత్తనాలు లేదా తోటి రైతుల నుంచి విత్తనాలు పొందిన వారు తమ పరిధిలోని ఏఈఓను సంప్రదించి వివరాలు నమోదు చేయించుకోవాలి. శుక్రవారం తిరుమలగిరి గ్రామంలోని విత్తన డీలర్‌ వద్ద జరుగుతున్న రైతుల నమోదు ప్రక్రియను వెంకటేశ్వర్లు పరిశీలించారు. రైతులందరూ నిర్ణీత గడువులోగా వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ను పొందాలని ఆయన కోరారు.