11 July, 2026 | 11:41 PM

హెచ్‌పీసీఎల్ నుంచి బోనస్ ఇష్యూ

07-05-2024 01:28 AM

మే 9న బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, మే 6: షేర్‌హోల్డర్లకు బోనస్ షేర్లను జారీచేసే ప్రతిపాదనను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సోమవా రం వెల్లడించింది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకునేందుకు మే 9న బోర్డు సమావేశం జరుగుతుందని, అదే రోజున 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నట్టు హెచ్‌పీసీ ఎల్ తెలిపింది. బోనస్ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపితే, షేర్‌హోల్డర్ల కు బోనస్ షేర్లను జారీచేయడం కంపె నీ చరిత్రలో ఇది మూడవసారి అవుతుంది. ఇంతకుముందు 2016లో 2:1 నిష్పత్తిలో హెచ్‌పీసీఎల్ బోనస్ షేర్లు జారీచేసింది. తదుపరి 2017లో 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చింది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్ షేరు 4% క్షీణించి రూ.513.65 వద్ద నిలిచింది. గత 12 నెలల్లో ఈ షేరు 100 శాతంపైగా పెరిగింది.