డీమార్ట్ లాభంలో 22.4% వృద్ధి
07-05-2024 01:31 AM
న్యూఢిల్లీ, మే 6: డీమార్ట్ రిటైల్ స్టోర్స్‌ను నిర్వహించే ఎవిన్యూ సూపర్‌మార్ట్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 22.4 శాతం వృద్ధి చెంది రూ. 460 కోట్ల నుంచి రూ. 563 కోట్లకు చేరింది. కంపెనీ ఆదా యం 20 శాతం పెరిగి రూ.12,727 కోట్ల వద్ద నిలిచింది. ఇబిటా 22.3 శాతం ఎగిసి రూ.943 కోట్లకు పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 41 స్టోర్లను ప్రారంభించామని, వీటితో తమ మొత్తం స్టోర్ల సంఖ్య 365కు చేరిందని కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోన్హ తెలిపా రు. ప్రస్తుతం దేశంలో 23 నగరాల్లో ఏవిన్యూ సూపర్‌మార్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.






