13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

విశాఖలో అలరించిన బూమ్ మాక్స్ ఈవెంట్

10-03-2026 10:15 PM

విశాఖపట్టణం: ‘లివింగ్ ఇట్ లార్జ్ ’ స్లోగన్ ను సరికొత్తగా పరిచయం చేస్తూ సీగ్రామ్ రాయల్ స్టాగ్  నిర్వహించిన  రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ నాలుగో ఎడిషన్ విశాఖలో సంగీతాభిమానులను ఉర్రూతలూగించింది. సంగీతం, గేమింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఒకే వేదికపై ఉత్సాహంగా సాగింది. సెలబ్రిటీ కళాకారులు చేసిన ప్రదర్శనలకు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. అత్యంత ఉత్సాహవంతమైన సెట్స్ నుండి మర్చిపోలేని స్టేజీపై క్షణాల వరకు, ఈ కార్యక్రమం  యువతను విశేషంగా అలరించింది.  వైజాగ్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాకుండా ఆకట్టుకునే ఇన్ స్టలేషన్స్, లీనమయ్యే ఆర్ట్ డిస్ ప్లేలతో పాటు ఫుడ్ స్టాల్స్ ఇంటరాక్టివ్ జోన్స్ లతో సందడిగా జరిగింది. 

 గేమింగ్ సంచలనం పాయల్ ధరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే  DJ సాహిల్ గులాటి బీట్స్ ఉర్రూతలూగించాయి.  విలక్షణమైన పాప్ స్టైల్ మరియు సమకాలీన బాలీవుడ్ హిట్స్ కోసం ప్రసిద్ధి చెందిన నిఖిత గాంధీ పెర్ఫార్మెన్స్ అలరించింది. వీటితో పాటు తెలుగు గాయకుడు శ్రీరామ చంద్ర తన అద్భుతమైన గాత్రంతో పలు హిట్ పాటలను ఆలపించి అందరిలో జోష్ రెట్టింపు చేశాడు.  రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ సంగీత ఉత్సవం కంటే ఎక్కువగా ప్రాచుర్యం పొందిందని నిర్వాహకులు పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దేబాశ్రీ దాస్ గుప్తా పేర్కొన్నారు.

ఇలాంటి అద్భుతమైన వేదికగా విశాఖ వాసులను అలరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని సింగర్ శ్రీరామ చంద్ర చెప్పారు. ఇదిలా ఉంటే రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్  తర్వాతి వేడుక మార్చి 28న మొహాలీలో జరుగుతుంది.