17 June, 2026 | 4:32 PM

Breaking News

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు   •   అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం   •   తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన   •   కలెక్టర్.. టీచర్ అయ్యారు   •   ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత   •   అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేత   •   శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు   •   మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి   •   జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు   •  

రెండో రౌండ్‌కు బోపన్న జోడీ షాంగై మాస్టర్స్

05-10-2024 12:00 AM

షాంగై: షాంగై మాస్టర్స్ టోర్నీలో భారత టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బోపన్న జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. బోపన్న- డోడిగ్ (క్రొయే షియా) ద్వయం 6-4, 6-3 తేడాతో మార్టినెజ్-కర్రెనో (స్పెయిన్) జోడీపై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ 63 నిమిషాల పాటు సాగింది. మ్యాచ్‌లో బోపన్న జోడీ ఐదు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్స్ చేసినా కానీ బోపన్న జోడీ మాత్రం మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ఇక సింగిల్స్ విషయానికి వస్తే.. రష్యా స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మెద్వెదెవ్ 7-5, 7-5తో బ్రెజిల్‌కు చెందిన విల్డ్‌పై సునాయాస విజయాన్ని అందుకొని రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

మిగిలిన మ్యాచ్‌ల్లో హంబర్ట్, డేవిడ్‌విచ్ ముందంజ వేశారు. ఇటీవలే చైనా ఓపెన్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్, రన్నరప్ జానిక్ సిన్నర్ నేరుగా బై లభించడంతో నేడు తొలి రౌండ్ ఆడనున్నారు. చైనాకు చెందిన షాంగ్‌తో అల్కరాజ్, టారో డేనియల్ (జపాన్)తో సిన్నర్ తలపడనున్నారు.