12 August, 2026 | 3:18 PM

వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

12-08-2026 02:14 PM

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):  ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గొండుగూడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (4) అనే చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలోని వాగులో పడిపోయింది.చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చేపట్టారు. వాగులో చిన్నారి ఆచూకీ లభించడంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.తల్లిదండ్రులు చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.