8 August, 2026 | 6:32 PM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా

08-08-2026 05:20 PM

స్టాండింగ్‌ లాంగ్‌జంప్‌లో మోహన్ష్‌రావుకు కాంస్యం

సుల్తానాబాద్‌,(విజయక్రాంతి): ష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఇండియన్‌ పబ్లిక్‌ పాఠశాల (ఐపీఎస్‌) విద్యార్థి జె. మోహన్ష్‌రావు ప్రతిభ చాటాడు. హనుమకొండలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫస్ట్‌ తెలంగాణ కిడ్స్‌ అథ్లెటిక్స్‌ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-6 బాలుర స్టాండింగ్‌ లాంగ్‌జంప్‌ విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీపడి మోహన్ష్‌రావు పతకం సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.

చిన్న వయసులోనే రాష్ట్రస్థాయిలో పతకం సాధించిన మోహన్ష్‌రావును పాఠశాల చైర్మన్‌ మాటేటి సంజీవ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ కృష్ణప్రియఅభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులనుప్రోత్సహించడంతో పాటు వారికి నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ, సాధనతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మోహన్ష్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

మోహన్ష్‌రావుకు శిక్షణ అందించిన కోచ్‌ సత్యనారాయణను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగాఅభినందించింది. విద్యార్థి విజయానికి కృషి చేసిన కోచ్‌ సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ సునీత, మేనేజర్‌ శివ, పీఈటీ లు సతీష్‌ , జ్యోతి తదితరులు పాల్గొని విద్యార్థిని అభినందించారు.