8 August, 2026 | 7:23 PM

చలో నల్గొండ-సామాజిక న్యాయ పోరాట సభ పోస్టర్ ఆవిష్కరణ

08-08-2026 06:03 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేటి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జిఎల్ గార్డెన్స్ దేవరకొండ రోడ్డు నల్గొండ నందు  రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధనకై జరుగు సామాజిక న్యాయపోరాట సభను విజయవంతం చేయుటకు బీసీ హక్కుల సాధన నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు, మాట్లాడుతూ... కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. కేంద్రo వద్ద పెండింగ్లో ఉన్న 42 శాతం రిజర్వేషన్ బిల్లును  ఆమోదించి రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

లోక్ సభ శాసనసభలలో 33% బీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి, బిసి విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ ను గతంలో  విదంగా నేరుగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకి విడుదల చేయాలి. నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి. హైకోర్టు సుప్రీంకోర్టులలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి. కేంద్రం రాష్ట్రంలోని ఉద్యోగాలను తక్షణమే భర్తీ  చేయాలనే తదితర డిమాండ్ లు తక్షణమే నెరవేర్చలన్నారు.