8 August, 2026 | 7:23 PM

సాయుధ పోరాటయోధుడు పండగ సాయన్న

08-08-2026 06:00 PM

హుజుర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్

నేరేడుచర్ల,(విజయక్రాంతి): భూస్వాములకు, రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన యోధుడు పండుగ సాయన్న అని, ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం అని హుజుర్నగర్ నియోజకవర్గం బిఆర్ యస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్ అన్నారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్లలో పండగ సాయన్న జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు.

ముదిరాజ్ కులంలో పుట్టిన ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి నిలిచి బహుజనాలకు అండగా నిలిచాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పల్లెపంగు నాగరాజు నేరేడుచర్ల మండల ఎన్.ఎం.ఆర్ ముదిరాజ్ యువసేన అధ్యక్షులు పంగ బుచ్చిబాబు,తకెళ్ళ నాగార్జున, షేక్ నాగుల్ మీరా, కొప్పు గౌతమ్ గౌడ్,తురక వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ రాం నర్సయ్య పటని వెంకటయ్య నాగరాజు,పంగ శ్రీను, తురక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.