అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం
08-08-2026 06:14 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డు సైడోనిగడ్డ తాండాలొ అండర్ డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ లావుడ్య శ్రీదేవి రమేష్ నాయక్,మున్సిపల్ కమిషనర్ ఎన్ కృష్ణా రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు మున్సిపల్ కార్యదర్శి రవీందర్ రెడ్డి స్థానిక ప్రజలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






