8 August, 2026 | 7:23 PM

డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డి) అవార్డుకు అర్హత సాధించిన నాగార్జున మల్లాది

08-08-2026 06:17 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): టెక్ మహీంద్రా సంస్థ పరిశోధనా స్కాలర్, వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ డెలివరీ హెడ్ నాగార్జున మల్లాది అనురాగ్ విశ్వవిద్యాలయము  నందు పీహెచ్‌డీ ప్రోగ్రామ్ అవార్డు కోసం నిబంధనలలో సూచించిన విద్యాపరమైన అవసరాలను పూర్తి చేశారు.

“ఎజైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో జనరేటివ్ ఏఐ  ఇంటిగ్రేషన్ కోసం ఒక క్రమబద్ధమైన ఫ్రేమ్‌వర్క్” అడాప్ట్ ఆర్టిఫిషియల్ ఇంజలిజెంట్ ఆసిమెట్రిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ఇంటిగ్రేషన్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే పీహెచ్.డి థీసిస్‌ను ప్రొఫెసర్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి (డీన్, అకడమిక్ అండ్ ప్లానింగ్) పర్యవేక్షణలో సమర్పించిన తర్వాత ఈనెల 7వ తేదీన నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, కాలికట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో జరిగిన వైవా పరీక్షలో ఉతీర్ణత సాధించారు. పరీక్షకుల ప్యానెల్ సిఫార్సుల మేరకు నాగార్జున మల్లాది ను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్. డి) అవార్డుకు అర్హత సాధించారని ప్రకటించారు.