calender_icon.png 10 November, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కోమటిరెడ్డికి బౌమాకోన్ ఎక్స్‌పో ఇండియా ఆహ్వానం

12-09-2024 02:15:43 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్‌తో కలిసి మెస్సెముంచెన్ ఇండియా సంస్థ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక బౌమాకోన్ ఎక్స్‌పో ఇండియాకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 14 మధ్య యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఈ కార్యక్రమం జరుగనుంది.

నిర్మాణ రంగంలో ఏటా వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ప్రదర్శించే ఈ ఎక్స్‌పోలో  వివిధ దేశాలకు చెందిన వెయ్యికి పైగా సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు.  ప్రదర్శనలో టెక్నికల్ సెషన్స్, ప్రొడక్ట్ సొల్యూష్యన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయని మంత్రికి తెలిపారు. రోజువారీగా ప్రదర్శనకు సంబంధించిన విజువల్ ప్రజెంటేషన్‌ను ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చూపించారు.