23 June, 2026 | 10:08 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

గట్లమల్యాల పీహెచ్‌సీలో ఘనంగా వీడ్కోలు

06-02-2026 05:45 PM

నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. అంజలి రెడ్డి ఉన్నత విద్య నిమిత్తం వెళ్తున్న సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో వీడ్కోలు,సన్మాన కార్యక్రమం నిర్వహించారు.​ ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ మంజుల, డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. అంజలి రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు అందించిన వైద్య సేవలను కొనియాడారు.

అనంతరం సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించి, ఉన్నత చదువుల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంగే నరేష్,ఉపసర్పంచ్ శ్రీనివాస్, సిహెచో, డిపిహెచో, సూపర్వైజర్లు, నర్సింగ్ సిబ్బంది, యుడీఎస్ &ఎల్డీసీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని ఆమెకు వీడ్కోలు పలికారు.