7 May, 2026 | 8:57 AM

పాము కాటుకు గురై బాలుడు మృతి

15-08-2024 01:47 PM

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ బాలుడు పాము కాటు తో మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాలుడు అఖిల్(9) కు రెండు రోజుల క్రితం పాముకాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ఈ క్రమంలో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతు బుధవారం మృతి చెందాడు. తల్లి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.