7 May, 2026 | 2:08 AM

అహో! ఏమి ఈ ఆహార్యం.. ముచ్చటగొల్పుతున్నది కదా!!

07-05-2026 01:18 AM

మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ మూవీని జూన్ 26న రిలీజ్ కానుంది. బుధవారం భాగ్యశ్రీ బోర్సే పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

రాజసం ఉట్టి పడేలా కిరీటం, మీసంతో భాగ్యశ్రీ ఆహార్యం ఆకట్టుకునేలా ఉంది. ఇంకా చెప్పాలంటే, ‘అహో..! ఏమి ఈ ఆహార్యం, ముచ్చటగొల్పు తున్నది కదా!!’ అని నాటకాల స్టుల్‌లో మెచ్చుకోకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్, కెమెరామెన్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు.  

‘సెయాన్’లో భాగ్యశ్రీ బోర్సే- డివైన్ లుక్ 

తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా, శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సెయాన్’. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్నారు. రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమె ఫస్ట్ లుక్.. ట్రెడిషన్, డివైన్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చుతున్నారు.