8 June, 2026 | 2:13 AM

పగటి దొంగ అరెస్ట్

08-06-2026 12:55 AM

జహీరాబాద్, జూన్ 7 : జహీరాబాద్ పట్టణంలో పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామని జహీరాబాద్ పట్టణ ఎస్త్స్ర లవ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి సర్కిల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా ఆయనను పట్టుకొని విచారించామన్నారు.

ఈ విచారణలో కర్ణాటక రాష్ట్రం చించోలి తాలూకా గరగపల్లి గ్రామానికి చెందిన పకీరప్ప కుమారుడు అమ్రేష్ గా తెలిపారు. అమ్రేష్ పట్టణంలోని తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. మోటార్ సైకిల్ తోపాటు మూడు తులాల రెండు మాసాల బంగారం, 15 తులాల వెండి పట్ట గొలుసులు స్వాధీనం చేసుకున్నామని ఎస్త్స్ర తెలిపారు. మద్యం సిగరెట్లు, గుట్కాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్త్స్ర లవ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి రిమాండ్కు తరలించారు. జహీరాబాద్ డి.ఎస్.పి సైదా నాయక్, సిఐ శివలింగం, ఎస్సై లవ కుమార్ ను పోలీసు సిబ్బందిని ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, పృథ్వి హరినేత్రలను అభినందించారు.