04-05-2025 10:59:53 AM
మహబూబాబాద్, (విజయక్రాంతి): మారిన నాగరిక ప్రపంచంలో మల్టీప్లెక్స్ లు, ఓటిటి ద్వారా సెల్ ఫోన్లలో సినిమాలను తిలకించే ప్రస్తుత రోజుల్లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని అమీనాపురంలో బ్రహ్మంగారి జీవిత చరిత్ర(Brahmamgari Jeevitha Charitra) వివరించినందుకు ఏర్పాటు చేసిన బుర్రకథ తిలకించి భలే బాగుందంటూ కితాబివ్వడం విశేషం. అమీనాపురం పరిధిలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో తొర్రూరు మండలం కంఠాయపాలెం కు చెందిన కాకతీయ బుర్రకథ బృందం ఆధ్వర్యంలో శనివారం రాత్రి బుర్రకథ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరై కథకులు బుర్ర రాము గౌడ్, వంతలు యాకన్న, సోమన్న బ్రహ్మంగారి జీవిత చరిత్ర విశేషాలను తమదైన శైలిలో కనుల విందుగా బుర్రకథను ప్రదర్శించారు. చాలామంది తమ పాత కాలం నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.