calender_icon.png 4 May, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో రైతుల... హరి గోస

04-05-2025 10:43:35 AM

తుంగతుర్తి మండలంలో సన్నధాన్యం ఒక్క సెంటర్ కూడా అధికారులు పెట్టకపాయే.

జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే సెంటర్  ఏర్పాటుకు రైతుల డిమాండ్

తుంగతుర్తి,విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Anumula Revanth Reddy) రైతుల ప్రయోజనాల దృష్ట్యా సన్న ధాన్యం పండించిన  వారికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం విధితమే. గత సీజన్లో పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు అదనంగా 500 బోనస్ ఇచ్చాడు కానీ ఈ సీజన్లో మాత్రం తుంగతుర్తి మండలంలో మొత్తం మీద ఒక్క సెంటర్ కూడా సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన ఆవేదనకు గురవుతున్నారు.

మండలంలో 20 రోజుల నుండి కొన్ని సెంటర్లలో ధాన్యం పోశారు. నేటి వరకు కూడా మండలంలోని ఏ అధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదు. తుంగతుర్తి కి మార్కెట్ చైర్మన్ నియామకం జరిగినప్పటికీ కనీసం రైతుల కష్టాలు(Farmers' problems) తీరుతలేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దిరాల మండలంలో రెడ్డిగూడెంకు ఒక సన్న కొనుగోలు ధాన్యం సెంటర్ ఇచ్చారు. అధికారులు అక్కడికి వెళ్లి పోసుకోవాలని చెబుతున్నారు. గడిచిన 20 రోజుల నుండి తమ సమీప కేంద్రాలలో పోసి ఆరబెట్టుకొని ధాన్యం తయారు చేశారు. తుంగతుర్తి లో ఒక్క స్టేడియం సెంటర్ లోనే సుమారు 4 లారీల సరుకు నిలిచిపోయింది. తుంగతుర్తి మండలం నుండి మద్దిరాల మండలానికి ధాన్యం తీసుకుని వెళ్లాలంటే అదనంగా ఒక్క ట్రాక్టర్కు అదనంగా 1500- 2000 రూపాయలకు పైబడి ఖర్చవుతుంది. మేము చాలా నష్టపోతాము. తక్షణమే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి యుద్ధ ప్రాతిపదికన తుంగతుర్తి మండలం లో ఏదో ఒక గ్రామంలో తప్పనిసరిగా సన్నవడ్లుకొనుగోలుకేంద్రాన్నిప్రారంభించాలని రైతులు కోరుతున్నారు