04-05-2025 11:02:37 AM
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ మండలం(Mahabubabad Mandal)లో ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి ఉత్తీర్ణులైన ప్రతిభావంతులకు కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సత్కరించారు. మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి ఫలితాలలో ఆయా పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులను, అదేవిధంగా జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన గూడూరు మండలం జడ్పీహెచ్ఎస్ తీగల వేణి విద్యార్థిని బాదావత్ పరమేశ్వరిని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏ సి జి ఈ మందుల శ్రీరాములు, వాకర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు మైస నాగయ్య, ముఖ్య సలహాదారులు మైస శ్రీనివాసులు, కోశాధికారి సోమ విష్ణువర్ధన్, మేడ వెంకటేశ్వర్లు మధుసూదన్ రెడ్డి, తోడేటి వెంకన్న , వెంకటేశ్వర్లు, సాగర్, నరేష్, దేవ్ సింగ్, బూర్ల ప్రభాకర్, కిషన్, రమేష్, గాంతి దేవేందర్ రెడ్డి, రామకృష్ణ, సాంబయ్య, వేముల రవీందర్ , రవీందర్, కిషన్, రామకృష్ణ , సంద వెంకన్న , నరసింహ రావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,13 పాఠశాలల నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.