6 March, 2026 | 7:58 AM

జ్ఞాన సరస్వతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు

06-03-2026 01:38 AM

పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

మేడ్చల్, మార్చి 5 (విజయ క్రాంతి): ఆనంద్ బాగ్ డివిజన్ అనంత సరస్వతి నగర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం 22వ వార్షిక బ్రహ్మోత్సవాలలో మల్కాజ్గిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అమ్మవారికి లక్ష పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మె ల్యే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మికతకు కేంద్రబిందువులని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణ అధికారి రవీంద్రారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చ కులు, బీఆర్‌ఎస్ నాయకులు రమ ప్రభాకర్ గౌడ్, మేకల రాము యాదవ్, చిన్న యాద వ్, కేబుల్ రమేష్, వైశాలి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.