పర్యవేక్షణ చేస్తేనే ఫలితం
ప్రతి విద్యార్థి పాఠశాలలో చేరేలా చూడాలి
అధికారులతో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్నగర్ జూలై 1 (విజయక్రాంతి): పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీలు చేపడుతూ ఎప్పటికప్పుడు విద్యార్థుల ఫలితాలను పర్యవేక్షణ చేస్తేనే ఉపయోగ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు ఎంఈఓ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రీ-ప్రైమరీ తరగతుల నమోదును సమీక్షిస్తూ, నమోదు లేని పాఠశాలల్లో కనీసం 10 మంది విద్యార్థులను చేర్పించాలని సూచించారు.
15 మందికంటే తక్కువ నమోదు ఉన్న పాఠశాలలు, అలాగే గత మూడు సంవత్సరాలుగా తక్కువ నమోదు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి విద్యార్థుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకొని వాటిని పరిష్కరిస్తూ విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, ఎ.ఎం.ఓ శ్రీనివాస్, సి.ఎం.ఓ సుధాకర్ రెడ్డి, జి.ఈ.సి.ఓ అస్రాఖాద్రీ, ప్లానింగ్ కోఆర్డినేటర్ ప్రశాంత్, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.






