7 May, 2026 | 1:28 AM

వసంతోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

07-05-2026 12:00 AM

మంగపేట, మే 6 (విజయక్రాంతి) : రెం డో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ములు గు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల (మల్లూరు) లక్ష్మీ నృసింహస్వా మి బ్రహ్మోత్సవాలు వసంతోత్సవం కార్యక్రమంతో బుధవారం ముగిశాయి. లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన బుధవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హే మాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు,

వా రి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈ శ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ (బాబీ), అనిపెద్ది రాజీవాచా ర్యులు తదితరుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వసంతోత్సవం సందర్బంగా ఆది లక్ష్మి, చెంచులక్ష్మి, శ్రీలక్ష్మీ నృసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గజ వాహనంపై  (గజ వాహన సేవ) స్వామి వారి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయ తిరు వీధులలో (ఆలయ సమీప ప్రాంతాలలో) దైత అమ్మ వారి (వన దేవత) విగ్రహం వరకు ఊరేగించి వసంతాన్ని(రంగు నీళ్ళను) ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాహణాధికారి ఎం.వీరాస్వామి, దేవాదాయ శాఖ పరిశీలకులు, కురవి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ యర్రంగారి సురేష్, ఉత్సవ కమిటీ సభ్యురాలు పాయం అనిత , ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.