4 August, 2026 | 2:15 PM

Breaking News

హైదరాబాద్‌లో పలుచోట్ల హెచ్-ఫాస్ట్ అధికారుల తనిఖీలు   •   ప్రజల్లో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం పెంచాలి   •   మృతుడి కుటుంబానికి మాజీ సుడా చైర్మన్ పరామర్శ   •   విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై దృష్టి   •   విమాన ప్రయాణీకుల భద్రతపై తీసుకుంటున్న చర్యలేంటీ?   •   ఓటరు జాబితా సవరణలో నర్సాపూర్ ఆదర్శంగా నిలవాలి   •   ఏటీసీ సెంటర్ కు భూమిపూజ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •   34.10 టి.ఎం.సి.లకు చేరిన ఎస్సారెస్పీ నీటి మట్టం   •   ఐదవ వార్డులో నూతన విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు   •   రాహుల్ గాంధీకి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే   •  

సైబర్ క్రైమ్.. బ్రాండ్ అంబాసిడర్!

16-10-2024 12:10 AM

నటి రష్మిక ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమి తులయ్యారు. కేంద్ర హోంశాఖకు చెం దిన సైబర్ దోస్త్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. రష్మిక సైతం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తాను గతంలో ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి కూడా ఆమె మాట్లాడా రు. ‘కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది.

అది సైబర్ నేరం కావడంతో నేను దానికి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నా. అంద రికీ సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలనుకున్నా. ఈ క్రమంలోనే నన్ను సైబ ర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర హోంశాఖ నియమించిందని చెప్పడానికి సంతోషిస్తున్నా.

సైబ ర్ నేరగాళ్లు మనల్ని టార్గెట్ చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటారు. వారి బారిన పడకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇకపై ఈ నేరాలపై నేను అవగాహన పెంచుతాను. సైబర్ నేరాల నుంచి దేశాన్ని కాపాడుతా’ అని రష్మిక తెలిపారు.