calender_icon.png 6 December, 2024 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీక్షణం.. మిస్టరీ థ్రిల్లర్

17-10-2024 12:00:00 AM

రామ్‌కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 18న థియేటర్ల ద్వారా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌కార్తీక్ మాట్లాడుతూ.. “థ్రిల్లర్ మూవీస్ అందరికీ ఇష్టమే.

అలా అందరికీ నచ్చే మంచి థ్రిల్లర్ మూవీ ‘వీక్షణం’. ఇది మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో ఆకట్టుకుంటుంది” అన్నారు. హీరోయిన్ కశ్వి మాట్లాడుతూ “వీక్షణం’ టీమ్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది” అని తెలిపారు.  “ఎవరి బిడ్డ వారికి ముద్దుగానే ఉంటుంది. మా ‘వీక్షణం’ సినిమా బాగుందని మేము చెప్పడం కాదు.. ప్రేక్షకులు థియేటర్లలో చూసి చెబితే చాలా సంతోషిస్తాం.

మా సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది” అని చిత్ర దర్శకుడు మనోజ్ అన్నారు. నటీనటులు బిందు, షైనింగ్ ఫణి, శ్రీనివాస్, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి, డీవోపీ సాయిరామ్, మిగతా చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.