calender_icon.png 8 November, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి హృదయాన్ని ప్రతిబింబించేలా..

16-10-2024 12:09:25 AM

తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాంధారి’. ఈ యాక్షన్ జానర్ సినిమా తల్లీకూతుళ్ల బంధం ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాతోపాటు కొన్ని ఆసక్తికర విషయాలను తాప్సి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. స్పై థ్రిల్లర్ జానర్ చిత్రంలో నటించాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే ఆ ఆశ తనకెప్పుడో నెరవేరిందని తెలిపింది.

బేబి, నామ్ షబానా చిత్రాల తర్వాత తిరిగి యాక్షన్ జానర్‌కి రావడంపై తాప్సి మాట్లాడుతూ.. ‘ఆసక్తికరంగా సాగే యాక్షన్ కథాంశాన్ని నేను నమ్ముతాను. స్పై థ్రిల్లర్ యాక్షన్ ప్రస్తుత ట్రెండ్ కాదు. అందరికీ స్పై థ్రిల్లరే కావాలి. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని నేను గతంలో చేశాను. తిరిగి అదే జానర్‌లో చేస్తే ప్రేక్షకులకు విసుగు రావొచ్చు.

కాబట్టి మరోసారి ఆ జానర్‌లో చిత్రం చేయాలనుకోవడం లేదు. ఒకవేళ నేను స్పై థ్రిల్లర్ చేయా ల్సి వస్తే మాత్రం మరో మం చి కథాంశాన్ని వెదుక్కుంటా’ అని తెలిపింది. గాంధారి చిత్రం కథాంశం గురించి తాప్సి మాట్లాడుతూ.. “గాంధారి’ కథ మిగతా వాటికి చాలా విభిన్నం.

కూతురికి జరిగిన అన్యాయానికి తల్లి ఎలా పగ తీర్చుకుంటుందనేది కథాంశం. ఈ చిత్రానికి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. కనిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తల్లి హృదయాన్ని ప్రతిబింబించే చిత్రమిది” అని తాప్సి పేర్కొన్నారు.