calender_icon.png 21 January, 2026 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం

21-01-2026 03:49:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): మార్కండేయ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంసిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం పట్టణ యువజన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రోగి బంధువులకు అల్ప ఆహార పంపిణీ చేపట్టారు. పద్మశాలీలు తమ కులదైవంగా భావించి ప్రతి ఏటా మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే నేడు ప్రసూతి ఆస్పత్రిలో తమ వంతు సామాజిక సేవలో భాగంగా ఈ అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా బ్లడ్ డొనేషన్ తో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ యువజన పద్మశాలి సంఘం అధ్యక్షులు తలకొక్కుల నరహరి అధ్యక్షులు, భాస్కర్, చిట్టి, నవీన్, వినోద్, శీను, ప్రధాన కార్యదర్శి నవీన్, కోశాధికారి జగదీష్, అరవింద్, ఉప అధ్యక్షులు, రమణ, కార్తీక్, రమేష్, సభ్యులు, ప్రతిష్, శీను, సంఘ సభ్యులు  పాల్గొన్నారు.