calender_icon.png 21 January, 2026 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్రికలు వారదులుగా నిలవాలి: కలెక్టర్ కె. హరిత

21-01-2026 03:52:03 PM

కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): పత్రికలు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారదులుగా నిలువాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆకాంక్షించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో గల తన చాంబర్ లో విజయ క్రాంతి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం పథకాల అమలులో మీడియా కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ క్రాంతి స్టాఫ్ రిపోర్టర్ చిప్ప సురేష్,రిపోర్టర్ రహీద్ పాషా తదితరులున్నారు.