7 April, 2026 | 11:18 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

ఇంటి తాళాలు పగులకొట్టి..

30-11-2024 02:14 AM

80తులాల బంగారం, రూ.2లక్షల నగదు అపహరణ

కూకట్‌పల్లిలో ఘటన

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి జయనగర్ కాలనీ సీతాప్యాలెస్ అపార్ట్‌మెంట్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాన్ని పగులకొట్టి బీరువాలోని 80తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదును దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. జయనగర్ కాలనీ సీతాప్యాలెస్ అపార్ట్‌మెంట్ డోర్ నంబర్ 301లో మధుసూధన్‌రెడ్డి అనే బిల్డర్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. నాలుగురోజుల క్రితం మియాపూర్‌లో నివాసముంటున్న అతడి కుమార్తె ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.

అయితే మధుసూధన్‌రెడ్డి మాత్రం ప్రతిరోజు సాయంత్రం జయనగర్ కాలనీలోని ప్లాట్‌కు వచ్చి వెళ్తుండేవాడు. శుక్రవారం ఉదయం ఏడుగంటలకు అపార్ట్‌మెంట్  వాచ్‌మెన్.. మధుసూధన్‌రెడ్డికి ఫోన్‌చేసి ఆయన ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు చెప్పారు. మధుసూధన్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరకొని వస్తువులు చిందరవందరగా పడిఉండటంతో పాటు బీరువాలోని బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు.  ఈ మేరకు కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం ఇంటిని పరిశీలించారు.కేసు దర్యాప్తు చేస్తున్నారు.