5 August, 2026 | 2:47 AM

పలు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు

05-08-2026 01:56 AM

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 4 (విజయక్రాంతి): మండలంలోని బంజర తండా,చినుర్ గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సర్పంచులు ధరావత్ సురేష్,మురళి గౌడ్ల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. చినూరు గ్రామంలో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ సురేందర్ చిన్నారులకు పాలు తాగించారు.

శిశువు పుట్టినరోజు నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు అమృతమని తల్లిపాలు, ముర్రిపాలు పిండి పారబోయకుండా శిశువుకు తాగించాలని సూచించారు.ప్రభుత్వం సరఫరా చేస్తున్న బాలమృతం పౌష్టికాహారని గర్భిణీలకు అందజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బంజర తండ,చినుర్ గ్రామాల సర్పంచులు ధరావత్ సురేష్,మురళి గౌడ్,ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్,కార్యదర్శులు అనిత,సుజాత, సూపర్వైజర్ హారతి, ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు,అంగన్వాడి టీచర్ సరిత, శ్యామల,ఆయా శైలజ, తదితరులు పాల్గొన్నారు.