12 May, 2026 | 1:30 AM

ఆపేదెవరు.. అంతా మా ఇష్టం!

12-05-2026 12:30 AM

అటవీశాఖ అధికారులకు చీమకుట్టినట్టైనా లేదు

భద్రాద్రి కొత్తగూడెం, మే 11 (విజయక్రాంతి): లాభాలే ప్రధాన అపేక్షగా కొనసాగుతున్న ఇటుక బట్టీల వ్యాపారానికి అన్ని అక్రమాలే. మమ్ముల్ని ఏ అధికారి ఆపుతారు అన్నట్టుగా ఉన్నది ఇటుక బట్టీల వ్యాపారుల వైనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం కూనవరం గ్రామం పరిసర ప్రాంతంలో ఇటుకల బట్టీలు పదుల సంఖ్యలో ఏదేచ్ఛగా సాగుతున్నాయి.

ఒకవైపు రోడ్డు పక్కనే సాగు భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా బట్టీలు కొనసాగిస్తున్న రెవెన్యూ అధికారులకు పట్టదు. మరోవైపు లక్షల విలువైన అటవీ సంపదను పెద్దపెద్ద దుంగలను నరికి ఇటుక బట్టేలకు వినియోగిస్తున్న అటవీ శాఖ అధికారులకు చీమ కొట్టినట్లు అయినా లేదు.

ఈ వ్యవహారం లోతుగా పరిశీలిస్తే వ్యాపారులకు అధికారులకు మధ్య లోపాయకార ఒప్పందం కుదిరినట్లు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని సైతం ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. మట్టి దగ్గర నుంచి కాల్చేందుకు ఉపయోగించే కలప వరకు మొత్తం యావత్తు అక్రమాలతోనే వ్యాపారం కొనసాగుతున్న అధికారులు ఎవరూ చర్యలు తీసుకోకపోవడం మామూళ్ల మత్తులో ప్రభుత్వ అధికారులు అన్న ఆరోపణను ధ్రువపరుస్తోంది.

తయారీకి ఉపయోగించే కూలీలను సైతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని బాల కార్మికులతో  పనులు చేయించడం కార్మిక చట్టాలను తుంగలో తొక్కటమే. అక్రమాల మాటున లాభాలే లక్ష్యంగా ఇటుక వ్యాపారులు అక్రమ ఇటుక  తయారీ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారులు అక్రమ కలప తయారీ పై దృష్టి సారించి పర్యావరణ పరిరక్షణ, విలువైన అక్రమ కలప, సాగు భూముల్లో ఇటుకల తయారీలను అరికట్టాలని లక్ష్మీదేవి పల్లె మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.