12 May, 2026 | 1:30 AM

నేడు కేఆర్‌ఎంబీ కీలక భేటీ

12-05-2026 12:32 AM
  1. తాగునీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ సమావేశం
  2. హాజరుకానున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఈఎన్సీలు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): కృష్ణా నది జ లాల పంపకాలపై మంగళవారం హైదరాబాద్‌లో కీలక సమావేశం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బో ర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సమావేశా న్ని నిర్వహించనున్నది. ఈ సమావేశం ఉదయం 11 గం టలకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధ భవనంలో జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇం జినీర్ -ఇన్-చీఫ్ (ఇరిగేషన్) ఏప్రిల్ 29న కేఆర్‌ఎంబీకి లేఖ రాసి, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా మే 31 వరకు 10 టీఎంసీల తాగునీటి అవసరం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం ఈ నీరు అత్యవసరమని పేర్కొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇంజినీర్ -ఇన్-చీఫ్ (జనరల్) మే 2న బోర్డుకు పంపిన లేఖలో.. జూలై 2026 వరకు రాష్ట్రానికి మొత్తం 18 టీఎంసీల తాగునీటి అవసరం ఉందని తెలిపారు.

ఇందులో శ్రీశైలం జలాశయం నుంచి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు 5 టీ ఎంసీలు, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కోసం 13 టీఎంసీల నీరు అవసరమని పేర్కొన్నది. ప్రస్తు త పరిస్థితుల్లో ఏపీకి నీటిని విడుదల చేస్తే తెలంగాణలో తాగునీటి సం క్షోభం తలెత్తే ప్రమాదం ఉందని మన రాష్ట్ర అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.

రాష్ట్రంలో ఎం డలు తీవ్రంగా ఉండటంతో నీటి నిల్వలను జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డా రు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పా టుచేసింది. మే 14న జరగనున్న కేఆర్‌ఎంబీ 21వ సమావేశానికి ముందు ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి.

ఈ సమావేశానికి రెం డు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కావాలని కేఆర్‌ఎంబీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీ రవిచంద్ర సూచించారు. కృష్ణా జలాల వినియోగం, తా గునీటి అవసరాలు, నీటి విడుదలపై కీలక నిర్ణయాలు వె లువడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి.