24-04-2025 01:56:40 AM
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులను తిరిగి తీసుకొచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదుల దాడి అనంతరం సుమారు 80 మంది తెలంగాణ వాసులు శ్రీనగర్‌లో చిక్కుకున్నారని ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.