24-04-2025 01:55:10 AM
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్‌లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పు లు జరపడం ఉన్మాదపు చర్య అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంతోనే ఉగ్రదాడి జరిగిందని పేర్కొన్నారు.
బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది మమ్మాటికీ పుల్వామా కంటే పెద్ద దాడి అని తెలిపారు. ఇప్పటికైనా ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తిచేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. దేశంలో మళ్లీ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.