12 July, 2026 | 2:37 AM

బ్రిటానియా లాభం రూ.536 కోట్లు

06-05-2024 12:06 AM

న్యూఢిల్లీ, మే 5: బ్రిటానియా ఇండస్ట్రీస్ 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.536.61 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో సంపాదించిన రూ.557.60 కోట్ల లాభంతో పోలిస్తే 3.76 శాతం క్షీణించింది. కంపెనీ ఆదాయం 1.14 శాతం వృద్ధితో రూ.4,023 కోట్ల నుంచి రూ.4,069 కోట్లకు పెరిగింది. డిసెంబర్‌తో ముగిసిన క్యూ3తో పోలిస్తే నికరలాభం 3.2 శాతం, ఆదాయం 4.2 శాతం చొప్పున తగ్గాయి. ముగిసిన త్రైమాసికంలో ఇబిటా కూడా 1.7 శాతం తగ్గి రూ.785 కోట్ల వద్ద నిలిచింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.73.5 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది.