తగ్గిన ఎం అండ్ ఎం ఫైనాన్స్ లాభం
06-05-2024 12:04 AM
ముంబై, ఏప్రిల్ మే 5: ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే ఎన్‌బీఎఫ్‌సీ మహీం ద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాండెలోన్ నికరలాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 10 శాతం క్షీణించి రూ.619 కోట్ల వద్ద నిలిచింది. తమ ఐజ్వాల్ శాఖలో రూ.135.9 కోట్ల విలువైన 2,887 మోసపు రుణ ఖాతాల్ని గుర్తించామని, ఆ మొత్తానికి తాజా త్రైమాసికంలో కేటాయింపులు జరిపినట్టు కంపెనీ వెల్లడించింది.






