నేడు సీఐఐ రీజనల్ కాన్‌క్లేవ్
10-05-2024 01:54 AM
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): సమగ్ర అభివృద్ధి, పారిశ్రా మిక రంగం బలోపేతమే లక్ష్యంగా హోటల్ ఐటీసీ కాకతీయ వేదికగా నేడు భారత పరిశ్రమల సమాఖ్య( సీఐఐ) రీజనల్ కాన్ క్లేవ్ నిర్వహించనుంది. పారిశ్రామిక నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ఇన్ ఫ్లూయెన్సర్లు, స్టార్టప్ నిర్వాహకులు కాన్ క్లేవ్‌లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జయేష్ రంజన్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఛైర్మన్, ఎండీ డాక్టర్ ఎస్.కె.ఝా, సీఐఐ సదరన్ రీజియన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, తదితరులు హాజరై ప్రసంగించనున్నారు.






