తెలంగాణ స్విమ్మర్ ఆరుష్ దాస్‌కు కాంస్యం
సబ్ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్
జైపూర్, ఆగస్టు 9: జైపూర్ వేదికగా జరగుతున్న సబ్ జూనియర్ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే శివానీ మూ డు మెడల్స్‌తో మెరిస్తే తాజాగా బాలుర 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో తెలంగాణకు చెం దిన ఆరుష్ దాస్ కాంస్య పతకం సాధించాడు. ఈ రేసులు ఆరుష్ 29.44 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్ స్విమ్మర్ క్రిషివ్ దోషి స్వర్ణం, కర్ణాటక స్విమ్మర్ శ్లోక్ సునీల్ రజతం గెలుచుకున్నారు.
కాగా ఆరుష్ దాస్‌కు ఇదే తొలి జాతీయ పతకం. కొంతకాలంగా రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ యువ స్విమ్మర్ ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అదరగొట్టాడు. సాట్స్ హెడ్ స్విమ్మిం గ్ కోచ్ ఆయుశ్ యాదవ్ దగ్గర ఆరుష్ శిక్ష ణ పొందుతున్నాడు. ఇదిలా ఉంటే 100 మీటర్ల మహిళల ఫ్రీ స్టుల్ ఈవెంట్‌లో శివా ని కర్రా రజతం సాధించింది. ఈ రేసును ఆమె 1 నిమిషం 1.28 సెకన్లలో పూర్తి చేసిం ది. శివాని కర్రా ఇదే పోటీల్లో 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో రజతం, 400 మీటర్ల ఫ్రీ స్టుల్ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.






