చరిత్ర సృష్టించిన బసంత్
హైజంప్‌లో రజతం కైవసం
లాంగ్ జంప్‌లో షహన్వాజ్‌కు కాంస్యం
అండర్ 20 వరల్డ్ అథ్లెటిక్స్
యూఎస్‌ఏ, ఆగస్టు 9: అమెరికాలోని ఒరెగా వేదికగా జరుగుతున్న అండర్ 20 వర ల్డ్ అథ్లెటిక్స్‌లో భారత్ యువ అథ్లెట్లు అదరగొడుతున్నారు. జావెలిన్ త్రోలో పదేళ్ల నిరీ క్షణకు ఆశిష్ యాదవ్ తెరదించితే తాజాగా హై జంప్, లాంగ్ జంప్‌లోనూ మన అథ్లెట్లు మెరిసారు. హై జంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల ఫైనల్లో సత్తా చాటిన బసంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం సాధించా డు. ఫైనల్లో ఈ భారత అథ్లెట్ రెండో ప్రయత్నంలో ఏకంగా 2.21 మీటర్ల ఎత్తు దూకాడు. తద్వారా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్వనతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
తద్వారా అండర్ 20 వరల్డ్ అథ్లెటిక్స్ హై జంప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. కాగా కొంతకాలంగా పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బసంత్ అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. హాంకాంగ్ వేదికగా జరిగిన ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అతను బంగారు పతకం గెలుచుకున్నాడు. వరల్డ్ అథ్లెటిక్స్‌లో చాలా తక్కువ సమయంలోనే ర్యాంకింగ్స్‌లోనూ దూసుకొచ్చాడు. మరోవైపు లాంగ్ జంప్‌లో సైతం భారత్‌కు మెడల్ వచ్చింది. యువ అథ్లెట్ షహన్వాజ్ ఖాన్ కాంస్యంతో మెరిశాడు. అతను 7.84 మీటర్లు దూకి మూడో స్థానంలో నిలిచాడు. అండర్ 20 వరల్డ్ అథ్లెటిక్స్ చరిత్రలో లాంగ్ జంప్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.






