8 June, 2026 | 7:04 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

వ్యభిచార గృహం గుట్టు రట్టు

12-11-2025 12:00 AM

ఐదుగురు విదేశీయుల అరెస్టు

శేరిలింగంపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 గురు విదేశీయులను అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్ పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌ఓటి, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహిం చారు.

అక్కడ తనిఖీ చేయగా విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశంలోని మొన్రోవియా సిటీకి చెందిన డేరియస్ (28) 2021 సంవత్సరంలో విద్యాభ్యాసం నిమిత్తం నగరానికి వచ్చి సుభాష్ చంద్రబోస్ నగర్‌లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తు తం ఆన్లైన్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతనితో పాటు కెన్యా దేశానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు ఉగాండా దేశానికి చెందిన మరో ఇద్దరు మహిళలతో కలిసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.

డేరియస్‌తో పాటు నలుగురు విదేశీ మహిళ లను అరెస్టు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వద్ద నుండి రూ.4 వేల నగదు, సెల్ ఫోన్ లను స్వా ధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా.. డేరియస్ను రిమాండ్కు తరలించినట్లు మియాపూర్ సీఐ శివ ప్రసాద్ తెలిపారు.వీరి వెంట ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.