విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నాజర్ షరీఫ్, అంజయ్య
- ఐదోసారి ప్రధాన కార్యదర్శిగా అంజయ్య ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నాజర్ షరీఫ్, పాపికంటి అంజయ్య ఎంపికయ్యారు. 2025-27 సంవత్సరాలకు గాను నూతన కమిటీని ఎన్నుకు న్నారు. మింట్ కౌంపౌండ్‌లోని వీఏవోఏటీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో నాజర్ షరీఫ్, పాపికంటి అంజయ్యలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీహరిస్వామి, ఉపాధ్యక్షులుగా శ్యామలరావు, పరమేష్, జాయిం ట్ సెక్రెటరీలుగా నర్సింహారాములు, దేవీదాస్, కోశాధికారిగా అనిల్, మహిళా కార్య దర్శిగా అనురాధ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు గా మధు, వేణుగోపాల్, జానయ్య, వెంకటే ష్ ఎన్నికయ్యారు.
తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీస ర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా అంజయ్య ఎన్నిక కావడం ఇది వరుసగా ఐదోసారి. గడిచిన పదేండ్లుగా అంజయ్యనే ఏకగ్రీవంగా అసోసియేషన్ ఎన్నిక చేస్తూ వస్తోంది. అసోసియేషన్ సభ్యు లు ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే అంజయ్యకు అసో సియేషన్ సభ్యులు కూడా అంతే మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. అనాథలకు అండగా, తల్లిదండ్రులు లేని పిల్లలకు గృహనిర్మాణం చేయించిన దాతృత్వాన్ని గుర్తించి తాజాగా జీ తెలుగు అచీవర్స్-2025 అవార్డును పాపికంటి అంజయ్యకు ప్రదానం చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.




