11-11-2025 10:55:59 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా, కొత్త బస్టాండ్, కన్నాల హైవే వద్ద మంగళవారం రాత్రి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలను పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా మండలంలో ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.