28 August, 2026 | 2:00 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

జూలైలో వస్తున్న తమ్ముడు

10-06-2025 12:00 AM

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

మరోవైపు ఈ మూవీ టీజర్‌ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్టు ఓ వినోదాత్మక వీడియో ద్వారా తెలియజేశారు. ఈ వీడియో ఆద్యంతం ఫన్నీగా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోకనాథ్; సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; ఎడిటర్: ప్రవీణ్ పూడి; నిర్మాత: దిల్ రాజు, శిరీష్; రచనాదర్శకత్వం: శ్రీరామ్ వేణు.