కృష్ణానదిలో పడి అన్నదమ్ముల మృతి
12-03-2026 01:25 AM
హుజూర్‌నగర్ (చింతలపాలెం) మార్చి 11: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని చింతిర్యాల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కృష్ణానదిలో మునిగి మృతిచెందారు. గ్రామానికి చెందిన షేక్ సైదా హుస్సేన్ కుమారులు సమీర్, సద్దాం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఉర్దూ పాఠశాలలో చదువుకుం టున్నారు. రంజాన్ సెలవులు కావడంతో గ్రామానికి వచ్చారు.
మంగళవారం ఉదయం తల్లి మిరపకాయలు కోసేందుకు పొలానికి వెళ్లగా పిల్లలు గేదెలు మేపేందుకు కృష్ణానది తీరానికి వెళ్లారు. నదిలో కొంత దూరంలో ఉన్న మైదానంలో గేదెలను మేపి, తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గుంతలో పడి మునిగి మృతి చెందారు. బుధవారం ఉదయం ఎస్డిఆర్‌ఎఫ్ బృందం గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి.




