calender_icon.png 16 May, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

15-05-2025 12:32:34 AM

అర్మూర్, మే 14 : అర్మూర్ మండలం చెపూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మూల మలుపు వద్ద అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...  ఆర్మూర్ పట్టణంలోని ధోబి ఘాట్ కు చెందిన  కొండూరు నాగార్జున, అతని తమ్ముడు కొండూరు నరేంద్రలు  జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి ఆర్మూర్ కు మోటార్ సైకిల్ పై బయలుదేరారు.

చెపూర్ గ్రామ శివారులోని సాయిబాబా గుడి వద్ద గల ఎన్‌ఎస్ 63 రోడ్ మలుపు వద్దకి మధ్యాహ్నం 12 గంటలకి చేరుకొనగా అదే సమయంలో ఆర్మూర్ నుండి మెట్పల్లి కి వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను  అతివేగంగా అజాగ్రత్త నడిపి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ బలమైన గాయాలు కావడంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడి కక్కడే మృతి చెందారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను అర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి 

జుక్కల్, మే 14 : జుక్కల్ మండలంలోని పడంపల్లి కంటే కొద్ది దూరంలో బైక్ పైనుంచి పడి బాన్సువాడ గ్రామానికి చెందిన పాతర్ల రాములు (56) అనే వ్యక్తి మృతి చెందినట్లు జుక్కల్ ఎస్సు భువనేశ్వర్ తెలిపారు. ఈనెల 12న మహారాష్ర్టలోని మరికల్ గ్రామం వద్ద ఉన్న వీరన్న గుడిలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో బైక్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

ఉదయం వాకింగ్‌కు వెళ్లే కొందరు వ్యక్తులు తమకు సమాచారం ఇవ్వగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.